Dhoni Paid Jeeva School Fee Per Annum Rs.2.75 Lakh
Dhoni Daughter Jeeva: సెలబ్రిటీల పిల్లల చదువు అంటే మరో లెవల్.. స్కూల్ అయినా సరే.. కాలేజ్ అయినా సరే అంతే సంగతులు. మరీ టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గారాల బట్టి జీవా ఏం చదువుతోంది.. ఆమె స్కూల్ ఎక్కడ, స్కూల్ ఫీజు ఎంతో తెలుసా..? ధోనికి (Dhoni) ఉన్న పేరు, పరపతికి జీవాను విదేశాల్లో చదివించొచ్చు.. రాంచీలో చదువు కొనసాగిస్తున్నాడు. అదీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గల స్కూల్. మరీ ఫీజు కూడా అలానే ఉంటుంది. ప్రైమరీ చదువుకే రూ. లక్షల ఫీజు కడుతున్నాడట ధోని (Dhoni).
రాంచీలో గల టౌరీయన్ వరల్డ్ స్కూల్లో ధోని కూతురు జీవా మూడో తరగతి చదువుతోంది. ఆమె డే స్కాలర్.. మరీ ఫీజు ఏ మాత్రం ఉంటుందని అనుకుంటున్నారు. అక్షరాల రూ.2.75 లక్షలు. ఒకవేళ హాస్టల్ కూడా కావాలని అనుకుంటే ఆ ఫీజు కాస్త రూ.4 లక్షలకు పైగా ఉంటుంది. డబ్బు కోసం కాదు కానీ.. చిన్న పాపపు వదిలి ఉండలేక ధోని డే స్కాలర్‌గా జాయిన్ చేశాడని తెలుస్తోంది. కానీ జీవా స్కూల్ ఫీజుతో ఓ మధ్య తరగతి కుటుంబం ఏడాది అంతా జీవించొచ్చు. కనీసం గ్రాడ్యుయేషన్ చేసి.. కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన ఉద్యోగికి ఇచ్చే సంవత్సరం జీతం కూడా దాదాపు అంతే ఉంటుంది.
ధోని (Dhoni) ఆడే మ్యాచ్‌లు.. ముఖ్యంగా ఐపీఎల్ జరిగే స్టేడియం వద్దకు జీవా వస్తుంటుంది. జీవాతో కలిసి ధోని స్టేడియంలో తిరిగిన సందర్భాలు కూడా క్రీడాభిమానులు చూశారు. జీవా మూడో తరగతి ఇంచు మించు రూ.3 లక్షల ఫీజు కడుతున్నాడు ధోని (Dhoni).. ఆమె పదో తరగతి వరకు ఆ ఫీజు… బారేడు అవుతుంది. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సంగతి చెప్పక్కర్లేదు. హైదరాబాద్‌లో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో కనీసం రూ.లక్ష నుంచి ఫీజు ఉంటుంది. ఇందులో సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, బ్యూరోక్రాట్ల పిల్లలు చదువుతుంటారు.