ప్రముఖ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(dhoni) సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే మొదటి ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ ఇప్పుడు తెలుగులోనూ పలు హీరోలతో మూవీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలిసింది.
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ధోనీ(dhoni production)కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెప్టెన్ గా ఉన్న సమయంలోనే టీమిండియా రెండు ప్రపంచ కప్‌లు గెలిచింది. అంతేకాకుండా, ఐపీఎల్లో తాను సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు కప్ గెలిచింది. ఇక ఆయన మైదానంలో కనపడితే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే, ధోనీ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అతని చిత్రానికి LGM (పెళ్లి చేసుకుందాం) రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా తమిళ సినిమా అనే విషయం కూడా అందరికీ విదితమే.
ఇప్పుడు ధోని రెండో ప్రొడక్షన్ వెంచర్ కూడా తమిళ ప్రాజెక్ట్ అని వార్తలు వస్తున్నాయి. ఈలోగా ధోని కూడా టాలీవుడ్ మార్కెట్‌ను అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి తెలుగు స్టార్స్‌పైనే ఉంది. ధోని ప్రొడక్షన్ హౌస్‌లో ఏ తెలుగు హీరో నటిస్తారు. ఆ ప్రాజెక్ట్‌కి ఏ దర్శకుడు దర్శకత్వం వహిస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోనీ మీడియం బడ్జెట్ సినిమాతో రావాలని ప్లాన్ చేస్తున్నాడు. రెండవ దశ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందరూ ధోని అభిమానులే కాబట్టి ధోనీ దగ్గరికి వస్తే ఏ హీరో కూడా తిరస్కరించడు. ఈ సినిమా తెలుగు(telugu), తమిళం, హిందీ భాషల్లో త్రిభాషా ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం.