»Mahaveerudu Movie Vijay Sethupathi In Tamil Ravi Teja In Telugu
Mahaveerudu: తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో రవితేజ..!
శివకార్తికేయన్ తన రాబోయే సూపర్ హీరో చిత్రం 'మావీరన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి, రవితేజ కూడా 'మావీరన్' స్టార్ కాస్ట్లో చేరారు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్లలో వరుసగా విజయ్ సేతుపతి, రవితేజ కథానాయకులుగా వ్యవహరిస్తారని శివకార్తికేయన్(shiva karthikeyan) అధికారికంగా ప్రకటించారు.
హీరో శివకార్తీకేయన్(shiva karthikeyan) స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విభిన్న కథలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం మావీరన్. తెలుగులో మహావీరుడుగా(Mahaveerudu) ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి తాజాగా క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. గతంలో మర్యాద రామన్న, అ సినిమాలకు రవితేజ తన గాత్రాన్ని అందించారు. తమిళ వెర్షన్ మావీరన్కి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వాయిస్‌ని అందించనున్నారు. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ అభిప్రాయపడుతోంది.
ఇందులో శివ కార్తికేయన్‌కి జోడీగా ప్రముఖ తమిళ్ డైరెక్టర్ కుమార్తె అదితి శంకర్(aditi shankar) నటిస్తోంది. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు మహావీరుడులో కీలక పాత్రల్లో నటించారు. ఏషియన్ సినిమాస్ ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. కాగా ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది.