»Trolling On Megastar Chiranjeevi With Keerthy Suresh
Trolling: మెగాస్టార్ పై ట్రోలింగ్..కూతురు వయసున్న హీరోయిన్‌తో?
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా.. ఇన్ని రోజులు అన్నను తమ్ముడు ఇమిటేట్ చేస్తే.. ఇప్పుడు తమ్ముడిని అన్న ఇమిటేట్ చేస్తున్నాడు. మెగాస్టార్(megastar chiranjeevi) లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్‌లో చిరుకు పవన్ పూనకం రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పాడు. ఇలాంటి విషయాలు మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నప్పటికీ.. కీర్తి సురేష్(keerthy suresh) విషయంలో మాత్రం నెటిజన్స్ ట్రోల్(trolls) చేస్తున్నారు.
రీసెంట్గా జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి(megastar chiranjeevi) ఇచ్చిన స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. తనకు ప్రేక్షకులే ప్రథమం అని, తాను ఏం చేసినా కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు చేస్తానని అన్నాడు. మీరందరూ గర్వపడేలా ఉండాలని.. ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ.. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నా.. నా మనసుకు నచ్చి చేసిన చిత్రమిది.. అని అన్నారు. అలాగే ఈ సినిమాలో నేనెక్కడా కనిపించను. తమ్ముడు పవనే కనిపిస్తాడు. అది మెగాభిమానులకు ఐ ఫీస్ట్‌గా ఉంటుందని అన్నారు మెగాస్టార్. దీంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఇక ఈవెంట్లో హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ కూడా హైలెట్‌గా నిలిచింది. ఇలా భోళా శంకర్ ఈవెంట్లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి.
వాటిలో కీర్తి సురేష్(keerthy suresh)తో మెగాస్టార్ చేసిన చిలిపి చేష్టలు కూడా సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్నాయి. కీర్తి చేయి పట్టుకొని మెలికలు తిరిగిపోవడం.. సినిమాలో మాత్రమే చెల్లెలు అని.. మళ్లీ హీరోయిన్గా ఆమెతో సినిమాలు చేయాలని.. కీర్తిని తనను అన్నయ్య అని పిలవకూడదని.. రిపీటేడ్గా చెప్పాడు చిరు. ఇలా చేయడంతో మెగాస్టార్ ఇంకా తన వయసు తగ్గలేదని చెబుతున్నాడా? లేదంటే కూతురు వయసున్న హీరోయిన్‌తో స్టేజీ పై ఆ చేష్టలు ఏమిటంటూ.. నెటిజన్స్ కామెంట్స్(comments) చేస్తున్నారు. అయితే.. ఇక్క భోళా శంకర్ ఈవెంట్ లోనే కాదు.. ప్రమోషనల్ ఇంటర్వూస్లోను కీర్తితో ఇలానే బిహేవ్ చేశాడు చిరంజీవి. దీంతో.. అరె చిరు ఇలా చేస్తున్నాడేంటీ, కీర్తిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా చేస్తాడా? అని సెటైర్స్ వేస్తున్నారు.
కొందరు మెగాస్టార్‌తో కీర్తి చాలా ఇబ్బంది పడుతోందని.. పాపం పాప పరిస్థితి ఏంటో.. అని ట్రోల్స్(trolls) చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి(sri reddy) అయితే మెగాస్టార్ పై రెచ్చిపోయింది. కూతురు వయసున్న నటితో ఆ కామ వేషాలేంటి? అంటూ విమర్శలు చేసింది. ఈవెంట్లో కనీసం గద్దర్‌కి మౌనం పాటించలేదని మండిపడింది. ‘సినిమాలో చెల్లెలు పాత్ర, నిజ జీవితంలో కూతురు వయసున్న అమ్మాయితో ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవి గారు, కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలతో పాటు మెగాస్టార్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. వీటికి మెగాఫ్యాన్స్ ఎంతలా కౌంటర్లు వేసిన..చిరు చిలిపి చేష్టలు మాత్రం ట్రోలింగ్‌కు దారి తీస్తున్నాయి. ఒకవేళ సినిమాలో కీర్తి, చిరు బాండింగ్ ఏ మాత్రం తేడా కొట్టినా..ఇక ట్రోలింగ్ స్టఫ్ దొరికిసినట్టే.