»Vijay Kushi Musical Concert On 15th August 2023 Hicc Hyderabad Free Tvs Rider Bike Gift
Kushi: ఆగస్ట్ 15న ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్..ఫ్రీగా బైక్ గిఫ్ట్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా చిత్రం “ఖుషీ(Kushi)” ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న ఈ మూవీ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ HICC, హైదరాబాద్‌లో జరగనుంది. అయితే ఈ వేడకకు హాజరైన అభిమానుల్లో ఒకరికి ఫ్రీగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు.
హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda), సమంత(samantha) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ(Kushi)’. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అయితే ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న సాలిడ్ బజ్‌ను పరిశీలిస్తే, ఖుషీ ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు ఈ మూవీ సాంగ్స్ మంచి హిట్ అయిన నేపథ్యంలో ఆగస్టు 15న మ్యూజికల్ నైట్ కాన్సర్ట్(Kushi musical concert )పార్టీని హైదరాబాద్(hyderabad) HICCలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ మ్యూజికల్ నైట్ కోసం వచ్చిన అభిమానుల్లో ఒకరికి ఉచితంగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ ఓ వీడియో రిలీజ్ చేస్తూ వెెల్లడించారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో సరికొత్తగా ప్రమోషన్లు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Get Ready Hyderabad 💥#Kushi Music Night Concert Will Held On August 15th ❤️🔥