»Hyper Aadi Counter To Ap Political Leader At Bhola Shankar Pre Release Event
Hyper Aadi: మంచి చేసే మా హీరోల జోలికి రావొద్దు..వారికి గట్టిగా ఇచ్చేశాడు
హైపర్ ఆది(hyper aadi) కౌంటర్లు, సైటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తమ అభిమాన హీరోలను టచ్ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆది స్పష్టం చేశాడు. అది కూడా మాములుగా కాదు. వరుస బెట్టి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కౌంటర్లు ఇచ్చేశాడు. మంచి చేసే మా హీరోల జోలికి రావొద్దని సూచించాడు. అయితే నిన్న భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆది మాట్లాడిన క్రమంలో పేర్కొన్నాడు.
Hyper Aadi counter to ap political leader at Bhola Shankar Pre Release event
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఫ్యామిలీకి అనేక మంది అభిమానులు ఉంటారు. అందులో హైపర్ ఆది(Hyper Aadi) ఒకరు. ‘జబర్దస్త్’ స్కిట్స్‌లో మెగా ఫ్యామిలీ, మెగా హీరోలపై సెటైర్లు వేసిన ఆది తాజాగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అదిరిపోతే పంచ్ డైలాగులు వేసి పలువురికి కౌంటర్ ఇచ్చాడు.
అయితే బేసిక్కా హీరోలకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి హీరోలే అభిమానులుగా ఉంటారని గుర్తు చేశారు. అంతేకాదు ఆస్తులు సంపాదించడం కన్నా..అభిమానులను సంపాదించుకోవడమే లక్ష్యంగా ఎదిగిన వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు. అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి వారధి, కొట్ల మంది అభిమానులకు సారథి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్షన్లు, డ్యాన్స్, ఫైట్స్ దేనిలోనైనా మార్క్ సెట్ చేసింది మొదట మెగాస్టార్ అనేది అనేక మంది తెలుసుకోవాలని గుర్తు చేశారు.
మరోవైపు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్(ram charan) మూవీ చిరుత వచ్చినప్పుడు అనేక మంది రామ్ చరణ్ యాక్టింగ్ గురించి కామెంట్ చేశారని పేర్కొన్నాడు. కానీ రంగస్థలం మూవీ చూసిన తర్వాత కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్ గా ఉన్నారని తెలిపాడు. అయితే అమితాబ్ కొడుకు అమితాబ్ కాలేదు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడని వెల్లడించాడు. చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ స్థాయి దాటి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక మెగాస్టార్(megastar)కు తన తమ్ముడు అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. ఆ క్రమంలో అనేక మంది తిడుతున్నారని చెప్పి పొలిటికల్ న్యూస్ సరిగా చూడటం లేదని తనతో పంచుకున్నట్లు హైపర్ ఆది గుర్తు చేశారు. అది తమ్ముడి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ. తమ్ముడికి కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం, ప్రేమ అని..ఎవరైనా అన్నయ్యను ఏదైనా అంటే వడ్డీతో సహా తిరిగి ఇచ్చే దాకా వదిలి పెట్టడని వెల్లడించాడు. మరోవైపు నాగబాబు(nagababu) కూడా టీవీ ఇండస్ట్రీలో తనలాంటి వారికి ఎంతో మందికి సాయం చేశారని గుర్తు చేశారు. అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారు. కానీ తమ్ముడిని ముంచడాలుండవ్. తాడో పేడో తేల్చుకోవడమేనని వెల్లడించాడు. ఈ ముగ్గురు కూడా డబ్బు మీద ఆశలేని వ్యక్తులు. కాబట్టి మంచి చేయాలని కోరుకునే వారిని ఎవరూ కూడా కామెంట్లు చేయోద్దని కోరారు.
తెలుగులో ‘క్షమ(sorry) అనే పదం నాకు నచ్చదు’ అని ‘ఠాగూర్’లో చిరంజీవి చెప్పినా… నిజజీవితంలో మెగాస్టార్ అందరినీ క్షమించేవాడని ‘హైపర్’ ఆది వ్యాఖ్యానించారు. వర్మ, గరికపాటి, అంబటి రాంబాబులపైనే కాదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు అవార్డులు ఇచ్చి, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక విమర్శించిన ప్రభుత్వాలను కూడా క్షమించారని ఆవేశంగా అన్నారు. సుమన్, ఉదయ్ కిరణ్ వివాదాల్లో చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చిన యూట్యూబ్ ఛానళ్ల గురించి కూడా హైపర్ ఆది ప్రస్తావించారు.
ఏపీలో మంత్రులు(ministers) ఎన్నికల గురించి మాట్లాడే వారు. కానీ ఇప్పుడు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాబట్టి… ‘భోళా శంకర్’ దర్శక నిర్మాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. నిన్న కలెక్షన్లు తక్కువ వచ్చాయి. అవును. ఆయన కలెక్షన్లతో పోలిస్తే మా కలెక్షన్లు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా హైపర్ ఆది గట్టి కౌంటర్ ఇచ్చారు.
తెలుగులో ఓ దర్శకుడు ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అలాగే చిరంజీవి గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ లేదు. ఆ దర్శకుడు చిన్న పెగ్ వేస్తే చిరంజీవిపై ట్వీట్ చేస్తాడని, పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తాడని అన్నారు. మీ వ్యూహాలు తెలిస్తే ఎదురుదెబ్బ తగులుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” – ఇదీ ‘హైపర్’ ఆది డైలాగు. ఆ మాటలు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ను ఉద్దేశించి చెప్పినట్లు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు వర్మ ‘వ్యూహం’ పన్నుతున్నాడు. అందుకే, ఈ సెటైర్ అన్నమాట.