»My Mother And Now Me Friends With Megastar Chiranjeevi Keerthy Suresh Said
Chiranjeevi:తో అప్పుడు మా అమ్మ, ఇప్పుడు నేను..కీర్తీ సురేష్ కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi), మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' రీమేక్ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన కీర్తి సురేష్(Keerthy Suresh) మోగాస్టార్ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
my mother and now me friends with megastar chiranjeevi keerthy suresh said
భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ మూవీలో చిరంజీవి(megastar chiranjeevi) సోదరిగా కీర్తి సురేష్(keerthy suresh) నటించింది. అయితే ఈ మూవీకి వీరి బంధమే అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాపై తాజాగా కీర్తి సురేష్ మాట్లాడింది. అన్నా, చెల్లెలి బంధమే ఈ సినిమాకి ప్రధానమైన అంశం అని కీర్తి సురేష్ చెప్పింది. ఇది ఇతర వాణిజ్య అంశాలతో కూడిన పక్కా ప్యాకేజీ చిత్రమని వెల్లడించింది.
అయితే పున్నమి నాగులో చిరంజీవి సరసన కీర్తి సురేష్ తల్లి(mother) మేనకా సురేష్ హీరోయిన్గా నటించడం విశేషం. చిరంజీవి గారి శక్తి అంకితభావం, సహ నటుల పట్ల శ్రద్ధ గురించి మా అమ్మ నాకు చాలా విషయాలు చెప్పారని కీర్తి సురేష్ తెలిపారు. మా అమ్మ చాలా అమాయకురాలని, కానీ చిరంజీవి గారు చాలా తెలివైన వారని 80ల సమూహంలో మా అమ్మ చెప్పినట్లు కీర్తి అన్నారు. అయితే అప్పుడు మా అమ్మ మెగాస్టార్ స్నేహితురాలి(friends)గా ఉండగా..ఇప్పుడు తాను మెగాస్టార్ కి కొత్త స్నేహితుడిగా మారినట్లు ఆమె చెప్పారు.
అయితే మెహర్ రమేష్(meher ramesh) చెప్పిన క్షణంలోనే కథ నచ్చిందని ఆమె అన్నారు. మెహర్ ప్రతి ఒక్కరిని చాలా కంఫర్ట్ గా ఉంచుతారని కీర్తి అభిప్రాయం వ్యక్తం చేసింది. అతనికి కమర్షియల్ మీటర్, ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసని వెల్లడించింది. నిజానికి మెహర్‌ను తాను అన్నయ్యలా చూసుకుంటానని అంది. ఈ సినిమాతో ఆయనకు చెల్లి, నాకు అన్నయ్య దొరికారని అన్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని కీర్తి పేర్కొనడం విశేషం.