»Viral Us Woman Sets Guinness World Record For Worlds Loudest Burp
US Woman గిన్నిస్ రికార్డ్.. ఎందుకంటే..?
గట్టిగా బేవ్ తీసి రికార్డ్ సృష్టించింది అమెరికాకు చెందిన క్లింబరీ వింటన్. 107.3 డెసిబిల్స్ సౌండ్ వచ్చేలా బేవ్ తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
Viral: US Woman Sets Guinness World Record For World's Loudest Burp
US Woman: అమెరికాకు చెందిన కింబర్లీ వింటన్ అనే మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా మీ సందేహాం.. ఆమె లాంగ్ బర్ప్ (బేవ్) తీసింది. అవును.. మీరు చదివింది నిజమే.. ఆమె చాలా సేపు.. బిగ్గరగా బేవ్ తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోకు నెటిజన్లు చాలామంది స్పందించారు.
కింబర్లీ వింటన్ తీసిన బేవ్కు 107.3 డెసిబిల్స్ సౌండ్ వచ్చింది. ఓ గదిలో.. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో రికార్డ్ చేశారు. అంతకుముందు ఇటలీకి చెందిన ఎల్సా చగొని 107 డెసిబిల్స్ సౌండ్‌తో బేవు తీసింది. కింబర్లీ బేవ్ను ఉదయం పూట రికార్డ్ చేశారు. ఆ వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుల్లో కింబర్లీ వివధ సందర్భాల్లో బేవులు తీసిన వీడియోలు చూడొచ్చు. ఆ వీడియోకు లౌడ్ సెట్ బర్బ్ అని రాశారు.
తనకు అంతా గట్టిగా బేవు రావడానికి గల కారణాన్ని కింబర్లీ తెలిపారు. ఐస్ కాఫీ, శాండ్ విచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటానని.. బ్యాకప్‌గా ఒక బీర్ ఉంచుకుంటానని వివరించారు. అలాగే కొన్ని నీళ్లను మాత్రమే తీసుకుంటానని.. స్పైసీ ఫుడ్, ఆల్కహాల్, సోడా తీసుకోవడంతో బేవు మరింత గట్టిగా వస్తోందని వివరించారు.