KTR ఏందీ, అప్పుడు అలా, ఇప్పుడు ఇలానా..? ఆర్ఎస్పీ అటాక్
చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ చేసేవి మాత్రం అందుకు విరుద్దం అంటున్నారు తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మొద్దని ప్లకార్డు పట్టుకొని కేటీఆర్ ఆందోళన చేసిన పిక్ ఒకటి షేర్ చేశారు.
KTR: మంత్రి కేటీఆర్‌పై (KTR) బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి కేటీఆర్ (KTR) ఫోటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫోటోలో భూముల అమ్మకం గురించిన ప్లకార్డు ఉంది. ఇప్పుడెమో కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం భూములను విక్రయిస్తోంది. అలా విక్రయిస్తూ భారీ ఆదాయం సమకూర్చుకుంటుంది. ఆ విషయాన్ని ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar) ప్రస్తావించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీరంగ నీతులు చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారా అని ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar) అడిగారు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ప్రభుత్వ భూములను విక్రయించడం ఎందుకు అని అడిగారు. అయినా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా అని సెటైర్లు వేశారు. సన్సాసులా అనే పదాన్ని బ్రాకెట్లో నాన్నగారి మాటల్లోనే అని కేసీఆర్‌ను కూడా లాగారు. ఉమ్మడి రాష్ట్రంలో.. తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రం సాధించింది ఉన్న భూములును అమ్ముకోవడానికేనా అని నిలదీశారు.
హలో… @KTRBRS గారు గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా(నాన్న గారి మాటల్లోనే) !
మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధలా ప్రయత్నిస్తున్నారు. కానీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదని గుర్తుచేశారు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1 శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లు వేసి గెలిపిస్తే, పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతం మింగేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఇప్పుడు అగ్ర కులాలదే ఆధిపత్యం అని ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar) అంటున్నారు. 1 శాతం ఉన్నవారి చేతిలో రాజ్యాధికారం బందీ అయ్యిందని విమర్శలు చేశారు. ఈ పరిస్థితి మారాల్సి ఉందన్నారు. 75 ఏళ్లలో ఏ ఆధిపత్య పార్టీలు తీర్చని లోటును బీఎస్పీ తీరుస్తుందని హామీనిచ్చారు.