హైదరాబాద్ రోడ్డు ప్రమాదం (Road accident)లో మృతి చెందిన చిన్నారి దక్షిత ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. రెండు వందల మంది సబ్స్కైబర్లు ఉన్నారు. దీక్షిత చేసిన అల్లరిని.. డ్యాన్సులను.. ముద్దు ముద్దు మాటలను ఆ చానెల్లో అప్లోడ్ (upload)చేసేవారు. దీక్షిత మరణంతో.. ఆ యూట్యూబ్ చానెల్ (YouTube channel) కూడా మూగబోయింది.ఈ ఛానల్ తన సొంతమని, ఓ వీడియోలో దీక్షిత స్వయంగా చెప్తూ.. సబ్స్కైబ్ చేసుకోండి ప్లీజ్ అంటూ ఆ చిన్నారి మాట్లాడుతున్న వీడియో చూస్తుంటే.. వీక్షకులకు కన్నీరు ఆగడం లేదు! బాధ కలుగుతుంది.బైక్ గుంతలోకి వెళ్లడంతో.. రోడ్డు మీద ఎగిరిపడింది దీక్షిత.
అదే సమయంలో వెనక నుంచి వచ్చిన స్కూల్ బస్సు దీక్షిత (Diksita) పైనుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. సంగతి తెలిసిందే. ఓనర్ గాజులరామారం మహదేవపురానికి చెందిన సత్యంరాజు, డ్రైవర్ షేక్రహీం(Sheikh Rahim)ను పోలీసులు అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు. బస్సుకు ఫిట్నెస్(Fitness), ఇన్సూరెన్స్ లేవని పోలీసులు తేల్చారు. ఇలాంటి బస్సును వినియోగిస్తున్నందుకు నిజాంపేట(Nizampet)లోని భాష్యం స్కూల్ నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ రహీంకు కుడిచేయి గాయమైంది. పైగా చిన్నారిని ఢీకొట్టిన సమయంలో అతను ఫోన్లో మాట్లాడినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.