»Atrocious In The School The Teacher Harassed The Student
PET Teacher: పాఠశాలలో దారుణం..స్టూడెంట్ను వేధించిన టీచర్!
మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కఠిన శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా 8వ తరగతి చదివే విద్యార్థినిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రులు స్కూల్‌పై దాడి చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకూ ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఆందోళన చేపట్టిన విద్యార్థిని బంధువులు:
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం
అత్తాపూర్ SR Digi స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు PET విష్ణు.
విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన PET. విషయం తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని.
స్కూల్లో ఫర్నీచర్, కంప్యూటర్ రూంను పగలగొట్టిన… pic.twitter.com/vAdEY3A7kr
అత్తాపూర్‌లోని ఎస్ఆర్ డీగీ స్కూల్లో 8వ తరగతి విద్యార్థినిపై స్కూల్ పీఈటీ విష్ణు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో పీఈటీ విష్ణు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పలుమార్లు దురుసుగానూ వ్యవహరించాడు. అంతేకాకుండా విద్యార్థినికి చాలా సార్లు ఫోన్లు చేసిమరీ ఇబ్బందులు పెట్టేవాడు. రానురాను పీఈటీ ఆగడాలు ఎక్కువవ్వడంతో విద్యార్థిని వాటిని భరించలేకపోయింది. దీంతో తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్ రూమ్‌ను పగలగొట్టి స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై దాడులు చేశారు. అయితే నిందితులు విష్ణు మాత్రం పరారీలో ఉన్నాడు. పీఈటీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు గ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
చైల్డ్ అబ్యూజ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇటువంటి ఘటనలు వెలుగుచూడటంతో స్థానికులు, గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని, ఫీజులపై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో కొరవడుతోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న పీఈటీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.