»Uttar Pradesh Went On A Date With A Girl By Dating App Boy Sexually Assaulted By Hotel Staff
Dating App: డేటింగ్ కోసం వెళ్లాడు..మొత్తం గుళ్ల చేశారు
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో డేట్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి రెస్టారెంట్ బిల్ విషయంలో వివాదం తలెత్తతింది. అతనితో వచ్చిన అమ్మాయి జారుకుంది. హోటల్ యజమాని, సిబ్బంది అతనిపై లైంగిక దాడి చేసి, అశ్లీల వీడియోలు తీసి, డబ్బులు, ఫోన్ అపహరించారు.
Uttar Pradesh, went on a date with a girl by dating app, Boy sexually assaulted by hotel staff
Dating App: డేటింగ్(Dating App) యాప్‌ల వలన జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కాదు. ఇన్ని రోజులు అమ్మాయిలకే ఈ ముప్పు ఉందని భావించారు. కానీ అబ్బాలు కూడా ఈ వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని కొంత మంది కేటుగాళ్లు డబ్బులు దుండుకుంటున్నారు. తాజాగా ఓ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రెస్టారెంట్ బిల్ కట్టలేదని ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఆ వ్యక్తిని తన కారులో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై అత్యాచారం చేయడమే కాకుండా అతడికి సంబంధించిన అశ్లీల వీడియోను కూడా రికార్డు చేశారు. తరువాత అతని దగ్గర ఉన్న డబ్బులు, ఫోన్ అపహరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మయూర్‌విహార్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. డేటింగ్ యాప్(Dating) ద్వారా ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో జూలై 27 న విక్కీ రెస్టారెంట్‌కు డేటింగ్‌కు వెళ్లాడు. తరువాత అతనికి రెస్టారెంట్ సిబ్బంది భారీగా బిల్ వేశారు. ఈ విషయంలో వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో స్టాఫ్ అతనితో దురుసుగా ప్రవర్తించింది. అంతలో తనతో వచ్చిన అమ్మాయి బాధితుడిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెస్టారెంట్ యజమాని. ఇద్దరు బౌన్సర్స్ జోక్యం చేసుకుని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లే దారుణంగా కొట్టి అతనిపై లైంగిక దాడి చేశారు. అంతటితో ఆగకుండా అశ్లీల వీడియోలు తీసి డబ్బులు, ఫోన్ తీసుకొని సదరు వ్యక్తిని వివేక్ విహార్‌లో వదిలేసి వెళ్లిపోయారు.
సృహ వచ్చిన తరువాత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా దోపిడీ, కిడ్నాప్, స్వలింగ సంపర్కం, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స కోసం అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తరువాత పూర్తి విచారణ తరువాత పోలీసులు రెస్టారెంట్ యజమాని విక్కీ అతని ఇద్దరు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడితో పాటు వచ్చిన మహిళ ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్టారెంట్ సిబ్బందితో ఆమెకు ఏదైనా సంబంధం ఉందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.