»Clarity On The News Samantha Incurred A Debt Of 25 Crores For The Treatment Of Myositis
Samantha: తన అప్పులపై సమంత క్లారిటీ
సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా అప్పులు చేసినట్లు వచ్చిన పుకార్లపై స్టార్ హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. అయితే తన చికిత్స కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
clarity on the news Samantha incurred a debt of 25 crores for the treatment of myositis
Samantha: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొంత కాలంగా మయోసైటిస్(myositis) వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంతా కోలుకుంటున్నారు. అయితే తాను ఈ జబ్బు నుంచి కోలుకోవడానికి టాలీవుడ్‌లోని ప్రముఖ వ్యక్తి నుంచి రూ. 25 కోట్లు అప్పు చేసిందని అనేక కథనాలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సమంతా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన ఇన్స్టాగ్రామ్(Instagram) వేదికగా మయోసైటిస్ చికత్సకు రూ. 25 కోట్లు తీసుకోవడం తప్పుడు వార్త అని, ఈ విషయంలో మీ అందరిని బురిడి కొట్టించారు అని రాసుకొచ్చింది. ఇక తనకు అప్పు చేయాల్సిన అవసరం లేదని, తన చేసిన సినిమాల వలన తనకు కావాల్సినంత ఉందని ఎవరిని అర్థించాల్సిన అవసరం లేదన పేర్కొంది. ఇక మయోసోటిస్ అనేది మరి వింతైనది కాదని, దీని వలన వేలాది మంది బాధపడుతున్నారంది. తాను కూడా చికిత్స తీసుకుంటుందని, దానికి సంబంధించిన అప్డేట్స్(Update) స్వయంగా తానే ఇస్తానని పేర్కొంది. అనవసరంగా ఇతరుల మాటలు నమ్మకండి అని చెప్పుకొచ్చింది.
సమంత చికిత్స కోసం ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక తన సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండకు జోడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. తరువాత దర్శకుడు రాజ్ అండ్ DK లు తెరకెక్కించిన సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్లో ప్రియాంక చోప్రా నటించారు.