మనుషులకు, పలు జంతువులకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మనిషి కూడా ఒక సామాజిక జంతువే అన్న కోణంలో మనుషుల్లాగానే జంతువులు ప్రవర్తించే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కోతులు, చింపాంజీలు(Chimpanzees), కుక్కలు.. ఇలా కొన్ని జంతువులు చాలా విషయాల్లో మనుషుల్లానే అనుకరిస్తాయి. ఇక ఎలుగుబంట్ల (Bears) విషయానికొస్తే ఆసియా ఖండంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు విభిన్నంగా ఉంటాయి. తూర్పు చైనా(East China)లోని హాంగ్ జౌలోని జంతు ప్రదర్శనశాలలో ఓ యానిమల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఆ జూపార్కులో ఎలుగుబంటి మనిషి పోలికలుతో ఉంది.సేమ్ మనిషిలాగానే నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు. మనిషికి ఎలుగుబంటి డ్రెస్ వేసి జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అయితే అది నిజమైన ఎలుగుబంటేనని మనిషి కాదని జూ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. మలయన్ సన్ ఎలుగుబంట్లు (Sun Bear) కాస్త మనుషులను పోలి ఉంటాయి. వీటిని ప్రపంచంలోనే అతి చిన్న ఎలుగుబంట్లుగా (Smallest bears) పరిగణిస్తారు. అది నిజమైన ఎలుగుబంటే అని నిర్ధారిస్తూ యూకేలోని ప్యారడైజ్ వైల్డ్‌లైఫ్ పార్క్ (Paradise Wildlife Park) ఓ వీడియోను షేర్ చేసింది. “ఇది ఎలుగుబంటే అని మేం నిర్ధారించగలం“ అంటూ కామెంట్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలోని మలయన్ సన్ ఎలుగుబంటి చూడడానికి అచ్చం మనిషిలాగానే కనిపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 43 వేల మంది లైక్ చేశారు. ఈ వింత జంతువును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వావ్.. అది నిజంగా ఎలుగుబంటేనా. నేను నమ్మలేకపోతున్నా“, ఇలాంటి ఎలుగుబంట్ల గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం అది చాలా అందంగా ఉంది“ అంటూ నెటిజన్లు (Netizens) కామెంట్లు చేస్తున్నారు.
చదవండి : Chiranjeevi:కి పెద్ద తలనొప్పి వచ్చి పడిందే!