సోషల్ మీడియా (Social media) ‘ప్రపంచం’లో పాపులర్ కావడానికి యువత రకరకాల ఫీట్లు చేస్తున్నారు.. అనేక రకాలుగా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో పాపులర్ అవ్వడం కోసం.. మిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ రీల్స్(Reels)ను అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని సార్లు.. వింత వింత పనులతో.. లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. వీరి వింత పనులతో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. పంజాబ్(Punjab)లోని హోషియాపుర్ సమీపంలో దాసుయాకు చెందిన గౌరీ విర్ది అనే యువతి ఇలాగే పోలీసు కేసులో చిక్కుకొంది. ఈమె ఇన్స్టాగ్రాం ఖాతాకు మిలియన్ (10 లక్షలు) ఫాలోవర్స్ రావడంతో ఆ ఆనందంలో కదులుతున్న వాహనంపై ఊరేగింది.
జమ్మూ జాతీయ రహదారిపై ‘1 మిలియన్’ బెలూన్ చూపుతూ బానెట్‌పై డాన్స్ (Dance) చేసింది. ఈ వీడియో వైరల్ కాగానే పోలీసులు రంగంలోకి దిగి ఆమెపై కేసు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్(Registration No) ఆధారంగా వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్ కూడా విధించారు.సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం నేటి యువత కొందరు దుస్సాహసాలు చేస్తూ కోరి కష్టాలు తెచ్చుకొంటున్నారు. యువత బైక్, రేసింగ్(Bike racing) లతో హడలెత్తిస్తున్నారు.అర్ధరాత్రి కాగానే.. ఖాళీ రోడ్డు కనిపించినా రెప్పపాటు వేగంతో దూసుకెళ్తూ వణుకు పుట్టిస్తున్నారు. కొందరు యువకులు బైకుపై ఫీట్లు చేస్తూ దూసుకెళ్లిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. లైసెన్సు లేని యువకులు, మైనర్లు ఈ తరహా విన్యాసాలు ఎక్కువగా చేస్తున్నట్లు పోలీసులు (Police) గుర్తించారు.