దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకి గానూ ఈ అవార్డ్ వచ్చింది. దాంతో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా.. కల నిజమైంది అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. జస్ట్ మహేష్‌తో రాజమౌళి సినిమాను ఇమాజిన్ చేసుకోండి అంటూ.. SSMB 29ని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌ను ట్రెండ్ చేస్తూ.. నెక్స్ట్ మీరే అని ఎన్టీఆర్.. మహేష్‌తో చెప్పిన డైలాగ్‌ను వైరల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ హాలీవుడ్ కటౌట్‌కి జక్కన్న తోడైతే.. బాక్సాఫీస్ సునామిని తట్టుకోవడం కష్టం అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి.. ఇండియానా జోన్స్ తరహాలో.. మహేష్ ప్రాజెక్ట్‌ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నానని చెప్పాడు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే.. మహేష్ బాబుతో ఫ్రాంచైజ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్‌తో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది. ఆగష్టులో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో సమ్మర్లో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.