»See How The Cigarette Baby Looks Coming As A Heroine
cigarette baby: ఈ నగరానికి ఏమైంది? సిగరెట్ పాప హీరోయిన్గా ఎంట్రీ
ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ప్రేక్షకుడు స్క్రీన్ పై ఫస్ట్ చూడాల్సింది మాత్రం సిగరెట్ యాడ్నే. పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పడానికి.. 'ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి' అనే యాడ్ ముందుగా ప్లే అవుతుంది. ఈ యాడ్‌లో నటించి చిన్న పాప చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
See how the cigarette baby looks? Coming as a heroine!
cigarette baby: ‘ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి’ యాడ్‌లో కనిపించే పాప అందరికీ తెలిసిందే. ఆమె క్యూట్‌నెస్‌తో ఆ యాడ్ భలేగా ఉంటుంది. ఆ పాప ఎవరు? ఆమె పేరేంటి? ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. యాడ్‌లో కనిపించిన పాప ఇప్పుడు హీరోయిన్ ఏజ్‌కు వచ్చేసింది. త్వరలోనే తెలుగులోను ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సిగరెట్ యాడ్‌లో కనిపించిన ఈ పాప పేరు సిమ్రన్ నటేకర్. ముంబైకి చెందిన ఈ పాప 1997లో జన్మించింది. చిన్న వయసులోనే యాడ్ లో కనిపించి దేశమంతటా ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె వయసు పాతికేళ్లకు పైగానే ఉంటాయి. అందుకే ఇప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీలో నిలబడేందుకు గట్టిగా ట్రై చేస్తోంది.
సిగరేట్ యాడ్ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించింది సిమ్రన్. ఆ తర్వాత ఫేమస్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో పూజ పాత్రలో నటించింది. బాలీవుడ్ హల్క్ క్రిష్ 3 లోనూ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది సిమ్రన్. ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు ఆడిషన్స్‌లో పాల్గొందట. తెలుగులో ఆ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. హీరో, డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా బయటికి రాకపోయినా.. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. దీంతో.. ప్రస్తుతం ఈ అమ్మడుకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సిమ్రన్ క్యూట్ లుక్‌తో కట్టి పడేస్తోంది.