JN: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామలో సోమవారం జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు, సూసైడ్‌కి గల కారణాలు తెలియాల్సి ఉంది.