»Pawan Kalyan Ustaad Bhagat Singh New Schedule Planned Around Mangalagiri
Pawan kalyan: మంగళగిరిలో ఉస్తాద్ షూటింగ్ ?
ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ సినిమాకి రీమేక్ గా ప్రకటించారు. తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా వచ్చేసింది. అందరూ చూసేసిన ఈ సినిమాను మళ్లీ ఆసక్తికరంగా ఎలా తీస్తారా అనే అనుమానాలు అభిమానుల్లో చాలానే ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. మొదట ఈ మూవీ రెండు, మూడు షెడ్యూల్స్ చాలా ఫాస్ట్ గానే పూర్తి చేశారు. కానీ, ఆ తర్వాత బ్రో మూవీ కోసం, ఇతర కారణాల కోసం ఆ షూటింగ్ ని ఆపేశారు. అయితే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. ఎలాగైనా ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఓవైపు పవన్ రాజకీయంగా తన అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉండటంతో, ఆయన మంగళగిరికే పరిమితం కానున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్స్ మొత్తం మంగళగిరి(Mangalagiri) పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని భావిస్తున్నారట. దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారని, సెట్స్ వేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందట. ఇటీవల హైదరాబాద్(hyderabad) లో ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అంతకంటే ముందు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎడిటింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, దాని ఎడిటింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుగుతోంది. మరి ఈ సినిమాతో హరీష్ పవన్ ఫ్యాన్స్ ని ఏమాత్రం మెప్పిస్తాడో చూడాలి.