Baby producer SKN brutality on Bhimavaram journalists
SKN: బేబీ(Baby) సినిమా నిర్మాత ఎస్కేఎన్(SKN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. మీడియా వేదికగా ఎంతో ఉత్సహాంగా కనిపించే అతను తన మాటలతో, చేతలతో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. తాజాగా బేబీ సినిమా ప్రమోషన్లో భాగంగా భీమవరానికి(Bheemavaram) వెళ్లిన ఆయన అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించాడు. దాంతో మీడియా ప్రతినిధులకు, ఎస్కేఎన్ మధ్య కాస్త రసాభాస నెలకొంది. చుట్టు ఉన్న బౌన్సర్లు మీడియాను ప్రతిఘటిస్తుండగా అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. మరీ ఘటనకు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు.
చదవండి:Manchu Manoj: మంచు మనోజ్ హోస్ట్ గా సరికొత్త షో!
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలో ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం బేబీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడి భారీ వసుళ్లను రాబట్టింది. మాములుగానే ఎస్కేఎన్కు మైక్ దొరికితే ఉత్సాహంగా మాట్లాడుతారు. అలాంటి బేబీ విజయం మరింత ఆనందాన్ని ఇచ్చింది. దాంతో మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే అపవాదు కూడా మూటకట్టుకున్నారు. తాజాగా బేబీ చిత్రం ప్రమోషన్లో భాగంగా భీమవరంలోని ప్రముఖ థియేటర్ను సందర్శించి మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది. బౌన్సర్ల సాయంతో నిర్మాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.
కవరేజ్ కు వచ్చిన మీడియా పై బౌన్సర్లతో దాడి మీడియా ప్రతినిధుల పై నిర్మాత SKN దౌర్జన్యం.. ఓ జర్నలిస్టులకు గాయాలు. రంగంలోకి దిగిన పోలీసులు.#BabyTheMovie#Babypic.twitter.com/rflAImEYMU