కోనసీమ: పి.గన్నవరంలో ఉన్న అక్విడెక్ట్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు.