»American Engineer Anil Varshine Lost His Job If He Spoke Hindi
Engineer: హిందీలో మాట్లాడాడు..జాబ్ ఖతం
అగ్రరాజ్యం అమెరికాలో ఇంజినీర్‌గా పని చేసే ఓ ఇండియన్ హిందీ మాట్లాడాడని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలేం జరిగింది? ఎందుకు తొలిగించారనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
American engineer: ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో ఉన్నా వారి కుటుంబాలలోని వ్యక్తులను పలకరించాలంటే వారి మాతృభాషలోనే మాట్లాడుతారు. అది సర్వసాధారణమైన విషయం. అయితే ఓ భారతీయుడు అలా హిందీ(Hindi)లో మాట్లాడి తన జాబ్ పోగొట్టుకున్నాడు(He lost job). మీరు విన్నది నిజమే. భారతీయ అమెరికన్ ఇంజినీర్(American engineer) అనిల్ వర్ష్ణే(78) ఆనారోగ్యంతో ఉన్న తన బావతో హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది. మిస్ కమ్యూనికేషన్ మూలంగా అమెరికా రక్షణ రహస్యాలను బయటకు చేరవేస్తున్నాడని హిందీ తెలియని తోటి ఉద్యోగి ఫిర్యాదుతో అనిల్‌ను సంస్థ నుంచి తొలగించారు. ఇది జాతివివక్ష మూలంగా తాను అక్టోబరు నుంచి నిరుద్యోగిగా ఉన్నానంటూ తాను పని చేస్తున్న సంస్థ పార్సన్స్ కార్పొరేషన్(Parsons Corporation) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆశ్రయం పొందాడు. 1968లో అమెరికాకు వలసవెళ్లిన అనిల్ దంపతులు ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఆయన భార్య 1989 నుంచి నాసా(NASA)లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనిల్ హంట్స్‌విల్‌లోని పార్సన్స్ కార్పొరేషనులో సిస్టమ్స్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వ క్షిపణి రక్షణ సంస్థ (MDA)కు ఇది గగనతల రక్షణ సేవలు అందించే సంస్థ. భూతలంపై క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించి ఎండీఏకి 50 లక్షల డాలర్లు ఆదా చేసినందుకు అనిల్‌కు గతంలో బెస్ట్ ఎంప్లయ్ అవార్డు అందుకున్నారు. అయితే భారత్‌లో ఉంటున్న అనిల్ బావ కె.సి.గుప్తా చివరి దశలో ఉండగా గతేడాది సెప్టెంబరు 26న అనిల్‌కు వీడియోకాల్ చేశారు. చివరి మాటాలు మనస్పూర్తిగా మాట్లాడాలి అని అనిల్ భావించాడు.
బావతో మళ్లీ మాట్లాడే అవకాశం లభించకపోవచ్చని అనిల్ ఒక ఖాళీ గదిలోకి వెళ్లి వాళ్ల భాషాలో అంటే హిందీలో మాట్లాడారు. ఈ సంభాషణ రెండు నిమిషాలపాటు సాగింది. ఇంతలో మరొక ఉద్యోగి వచ్చి వీడియోకాల్ మాట్లాడకూడదని అన్నారు. అనిల్ వెంటనే ఫోన్ ఆఫ్ చేశాడు. భాషా తెలియని ఆ సదరు ఉద్యోగి సంస్థ రహస్యాలను బయటకు చెబుతున్నారని భావించి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ఆ కంపెనీ అనిల్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఎండీఏ కార్యక్రమాల్లో ఎన్నటికీ పాల్గొనకూడదని నిషేధించింది. అయితే వీడియో కాల్స్ నిషేధం ఆ కంపెనీలో లేదు. ఇక ఎండీఏ అధికారులు ఆయన ఫైళ్లను, ఇతర సామగ్రినీ క్షుణ్నంగా శోధించినా నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ మేరకు తనను తిరిగి జాబ్లోనికి తీసుకోవాలి లేదా నష్టపరిహారం చెల్లించాలంటూ అనిల్ కోర్టుకెక్కారు.