Luxury Cars In India: కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. జనం తీరు మారింది. ఉన్నంత వరకే ఎంజాయ్ చేద్దాం అనే తీరులో ఉన్నారు. సేవింగ్స్, పొదుపు అనే మాటే లేకుండా పోతుంది. అంతకుముందు ప్రీమియం కార్లను కొందరే వాడే వారు. ఇప్పుడు కాస్ట్లీ కార్లు (Luxury Cars) ప్రతీ గల్లీలో ఉంటున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కార్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి.
2023 ఏడాది మొత్తానికి కాదు.. మొదటి ఆరునెలల్లోనే రికార్డు స్థాయిలో లగ్జరీ కార్ల (Luxury Cars) విక్రయాలు జరిగాయి. గత ఏడాది కన్నా ఎక్కువ సేల్స్ అయ్యాయి. జనవరి నుంచి జూన్ వరకు 8528 బెంజ్ కార్ల విక్రయాలు కాగా.. గత ఏడాదితో పోలిస్తే 13 శాతం ఎక్కువ సేల్స్ అయ్యాయి. ఇక బీఎండబ్ల్యూ విషయానికి వస్తే 5867 కార్లు అమ్ముడుపోయాయి. 5 శాతం విక్రయాలు పెరిగాయి. వీటిలో 391 మినీ కార్లు కూడా ఉన్నాయి.
3473 ఆడి కార్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 97 శాతం ఎక్కువగా కార్లు అమ్ముడుపోయాయి. కార్ల విక్రయాలు దాదాపు డబుల్ పెరిగాయి. తొలి ఆరు నెలల్లో 21 వేలకు పైగా లగ్జరీ కార్లు సేల్ అయ్యాయి. తర్వాత ఆరు నెలలతో కలిపి ఏడాది 46 వేల కార్ల నుంచి 47 వేల కార్ల వరకు ఉండొచ్చు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి ఆరు నెలల కన్నా.. తర్వాత 6 నెలల్లో లగ్జరీ కార్ల (Luxury Cars) విక్రయాలు ఎక్కువగా జరుగుతాయని ఆటో మొబైల్ వర్గాలు చెబుతున్నాయి.