»Malala Yousafzai Calls Herself Nobel Prize Barbie
‘Nobel Prize Barbie’ని అంటోన్న మలాలా.. ఆమె భర్త ఏమన్నాడంటే
నోబెల్ ప్రైజ్ బార్బీని తాను అని మలాలా అభివర్ణించుకున్నారు. భర్త అసిర్ మాలిక్ కేవలం కెన్ అని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ ట్రోల్ అవుతుంది.
Malala Yousafzai: మలాలా (Malala) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాకిస్థాన్‌లో చదువుకునేందుకు ఆమె పాడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె చేసిన ధైర్య సాహసాలకు నోబెల్ ప్రైజ్ కూడా వరించింది. విద్య పూర్తి చేసి.. అసర్ మాలిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ జంట తాజాగా బార్బీ అనే ఇంగ్లీష్ మూవీ చూశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బార్బీ సెటప్ వద్ద ఫోటో దిగారు. దానికి మలాలా తనను తాను నోబెల్ ప్రైజ్ బార్బీ అని పేర్కొన్నారు. ఆ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
పింక్ కలర్ బార్బీలో మలాలా (Malala) కపుల్ నిల్చొని ఉన్నారు. మలాలా పింక్ కలర్ కుర్తా వేసుకున్నారు. ఆమె భర్త వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. దాని పైగా బ్లేజర్ కూడా ఉంది. ఆ ఫోటోకు బార్బీ నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది. అతను కేవలం కెన్ అని రాసింది. మలాలా పోస్ట్‌కు ఆమె భర్త స్పందించాడు. తాను కెనాఫ్ అని పోస్ట్ చేశారు.
రెండు రోజుల క్రితం మలాలా (Malala) ఈ పోస్ట్ చేశారు. ఇప్పటికే 46 మిలియన్ చాలా సార్లు చూశారు. వారిలో చాలా మంది లైక్ కూడా చేశారు. ఆ పోస్ట్‌కు కామెంట్స్ కూడా వస్తున్నాయి. కెన్ బార్బీ యొక్క ఆస్తి అని ఒకరు.. మీరు చాలా కూల్ అని ఇంకొకరు.. హా హా హా.. ఈ బార్బీ నిజమైన నోబెల్ ప్రైజ్ విన్నర్ అని మూడో వ్యక్తి ట్వీట్ చేశారు. షట్ డౌన్ మిమ్ ఇక పూర్తయ్యింది.. ఇప్పటికే అవార్డు గెలుచుకుందని అన్నారు. ఓకే, అందరూ తమ క్యాప్షన్స్ ప్యాకప్ చేయాలని మరొకరు రాశారు. మలాలా గెలిచిందని.. సో క్యూట్ అని, గార్జియస్ కపుల్ అని కామెంట్స్ వచ్చాయి. ఇద్దరి మధ్య మంచి కమ్యునికేషన్ ఉందని రాశారు.