»Elections Of Telugu Film Chamber Of Commerce Today Results At 6 Oclock
TFCC Elections : నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు..6 గంటలకు ఫలితాలు
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు(TFCC Elections) నిర్వహించనున్నారు. ఈ సారి గట్టి పోటీ నెలకొంది. దిల్ రాజ్(Dil Raju), సి.కళ్యాణ్ (C.Kalyan) ప్యానెల్ మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్(Polliing) జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.
ఫిలిం ఛాంబర్ (Film Chamber)లో ప్రస్తుతం మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. నేటి ఎన్నికల్లో మొత్తం 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఎలాంటి వివాదాలు లేవని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ ను బలంగా చేయడానికి నిర్మాతలు అంతా ముందుకు వచ్చి ఎన్నికల బరిలో నిలిచామని దిల్ రాజు తెలిపారు. మా ప్యానెల్ లో వ్యాపారస్తులు అంతా ఉన్నారని, వారి వల్ల ఉపయోగం లేదన్నారు. ఎక్జిబిటర్లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం కోసం సరైన టీం కావాలని దిల్ రాజు తెలిపారు.