King Cobra: పొలంలో 13 అడుగుల కింగ్ కోబ్రా..ఒళ్లు జలదరించే వీడియో
పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా కోబ్రా తిరుగుతోంది. ఓ రైతు కంట పడటంతో ఆ పాము ఒక్కసారిగా ఎటాక్ చేసింది. స్థానికులు అలర్ట్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత 13 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు.
పాము(Snakes)లంటే అందరికీ భయమే. దూరం నుంచి పాములను చూస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది దగ్గరగా వస్తే ఇక భయంతో పరుగులు తీయాల్సిందే. ఈ పాముల వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ (Videos Viral) అవుతుంటాయి. తాజాగా పాములకు రారాజు అయిన కింగ్ కోబ్రా(King Kobra) వీడియో నెట్టింట సందడి చేస్తోంది. పంట పొలాల మధ్య నిరంతరం సంచరిస్తుండే 13 అడుగుల కింగ్ కోబ్రా వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
విశాఖ జిల్లా(Visakhapatnam)లోని మాడుగుల నియోజకవర్గం చీడికడ మండలంలో ఈ పాము ఘటన కలకలం రేపింది. తురువోలు గ్రామంలో రైతులు 13 అడుగుల పాము(Snake)ను చూశారు. అక్కడంతా వ్యవసాయం చేసే రైతులే ఉన్నారు. రైతులు, వారి కుటుంబ సభ్యులంతా కూడా పొలాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కొందరైతే అక్కడే రాత్రి వేళల్లో తిరుగుతుంటారు. అలాంటి పంట పొలాల మధ్య గత కొన్ని రోజులుగా కింగ్ కోబ్రా(King Cobra) తిరుగుతోంది. ఆ కోబ్రా రైతు మీద దాడి చేయడంతో తృటిలో తప్పించుకున్నాడు. స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు.
స్నేక్ క్యాచర్లు కోబ్రా(King Cobra) ను పట్టుకునేందుకు చాలా రిస్క్ చేశారు. వరినాట్లు ఉండటం, మరో వైపు వర్షపు నీటితో పంటలు నిండి ఉండటంతో కోబ్రా వేగంగా పరుగు తీస్తున్నా స్నేక్ క్యాచర్లు వదిలిపెట్టలేదు. వారిపై అది బుసలు కొడుతూ ఎగబడింది. దీంతో అక్కడున్నవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. పారిపోయే ప్రయత్నం చేస్తున్న ఆ కోబ్రాను సాహసం చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కోబ్రాను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.