ELR: బుట్టాయగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అనంతరం వారు జలాశయం వద్దకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.