»I Am Not Biryani To Make Everyone Happy Vishwak Sen About Baby
Vishwak Sen: అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీ కాదు.. విశ్వక్ సేన్..!
టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరస సినిమాలతో ఈ హీరో దూసుకుపోతున్నాడు. ఇటీవల దాస్ కా దమ్కీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
విశ్వక్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ మూవీ ముందు ఆఫర్ విశ్వక్ సేన్ కే వచ్చింది. అయితే, కనీసం విశ్వక్ కథ కూడా వినడానికి ఆసక్తి చూపించలేదు అనే విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఈ విషయం పై సమయం వచ్చినప్పుడల్లా విశ్వక్ స్పందిస్తూనే ఉన్నాడు. తాజాగా, పేకమేడలు’ సినిమా టీజర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఇటీవల జరిగిన కాంట్రవర్సీపై స్పందించాడు. అందరినీ ఆనందంగా ఉంచేందుకు తానేమీ బిర్యానీ కాదంటూ సినిమా, దర్శకుడి పేరుని ప్రస్తావించకుండానే వ్యాఖ్యలు చేశాడు.
‘ఎవరి పనిని బట్టి వారు బిజీగా ఉంటారు. ఎలాంటి సినిమాలు చేయాలి అనే క్లారిటీ లేనప్పుడు వేరే వారి సలహా తీసుకుంటాం. ఒక్కోసారి ఎదుటివారి టైమ్ వేస్ట్ చేయకూడదనుకుంటాం. అందుకే ‘కలవలేం, కథ వినలేం’ అని దర్శకుడికి చెబుతుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను కదా. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ సినిమా బాగుందని ఇతరులను కించపరచొద్దు.
అదొక్కటి బాధగా ఉంది. చిన్న సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం అందరూ సంతోషించే విషయం. ఆ చిత్ర టీమ్ కి నేను శుభాకాంక్షలు కూడా చెప్పా. సినిమా ట్రైలర్ బాగుందని వాట్సాప్ గ్రూప్లో ముందుగా మెసేజ్ చేసింది నేనే. అయినా, దర్శకుడిని నేను కలవలేదంటూ మీమ్స్ వచ్చాయి. గంట చర్చించి నో చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అనుకుని చెప్పా’అన్నారు. బేబీ మూవీ గురించే ఆయన ఈ కామెంట్స్ చేశాడు అనే విషయం స్పష్టంగా అర్థమౌతుండటం విశేషం. ఆయనపై డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన కామెంట్స్ కి హర్ట్ అయ్యి, ఈ విధంగా స్పందిస్తుండటం విశేషం.