KRNL: మంత్రాలయం(M) రాఘవేంద్రపురంలో జగనన్న ఇంటి స్థలాల్లో పేదల నివాసం కోసం గుర్తించిన స్థలాన్ని ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఆక్రమించడం సరికాదని CPM మండల కార్యదర్శి జయరాజు అన్నారు. కొందరు రాత్రికి రాత్రే బండలు దింపి పేదల స్థలాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి అధికారులు పొజిషన్ ఇవ్వడం ఆశ్చర్యకరమని, వెంటనే ఆ పొజిషన్ను రద్దు చేయాలన్నారు.