మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.