రాజకీయ నాయకులు స్పీచ్ ఇస్తూ నోరు జారడం చూస్తూనే ఉంటాం. అలా టంగ్ స్లిప్ (tongue Slip) అయి తర్వాత నవ్వుల పాలయ్యే నేతలు అనేక మందే ఉంటారు. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ ఎంపీ సోయం బాపురావు (MP Soyam Bapurao)నోరు జారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ పొరపాటున అన్న మాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొత్త సారథికి అభినందనలు. తెలుపుతూ ఆయన ప్రమాణ స్వీకారం పదానికి బదులు సెక్స్ అన్నారు. దీంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాకయ్యారు.ఈ వీడియో (Video) ఇంటర్నెట్లో పోస్ట్ చేయగా పలువురు నెటిజన్లు వెరైటీ రిప్లేలు ఇస్తూ ట్రోల్ చేస్తున్నారు.