చత్తీస్గఢ్ రాష్ట్రం(Chhattisgarh State)లో ఓ గిరిజన తెగ ఓ వింత ఆచారాన్ని పాటిస్తోంది.పెళ్లిళ్ల సమయంలో.. సన్వారా తెగలోని వధువు తరపు వారు వరుడికి పాములను కట్నంగా ఇచ్చుకుంటారు. మొత్తం 9 రకాల జాతులకు చెందిన 21 సర్పాలను అల్లుడికి అందజేస్తారు.వారు అలా కట్నం(dowry)గా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోరు. వివాహ సమయంలో మెట్టినింటికి 9 జాతుల పాముల(snakes)ను తీసుకు రాలేకపోతే ఆ పెళ్లి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సన్వారా గిరిజనులు భావిస్తారట. పూర్వకాలంలో వీరు విషపూరిత సర్పాలను కట్నంగా ఇచ్చుకునేవారు.అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందుకు అనుమతించట్లేదు.
కేవలం విషరహిత పాములను మాత్రమే పట్టుకునేందుకు గిరిజనుల(Tribal)కు అనుమతిస్తుంది. అది కూడా స్థానిక సంప్రదాయాలను గౌరవించి వీరికి ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చింది. నిజానికి ఇలాంటి ఆచారాలను యూత్ పాటించరు అనుకుంటాం కానీ ఈ తెగలో తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించేందుకే ఇక్కడి యువకులు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి(wedding) లో వరుడికి కట్నంగా ఏదో ఒకటి ఇస్తుంటారు. డబ్బు, పొలమో కానుకగా ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే పాములను బహుమతిగా ఇచ్చే ఆచారాన్ని ఎప్పుడైనా చూశారా? అవును మీరు వింటున్నది నిజమే.