»Bandh Of Educational Institutions On July 25 In Ap
Andhrapradesh: ఏపీలో జూలై 25న విద్యాసంస్థల బంద్
ఏపీలో జూలై 25న విద్యాసంస్థల బంద్ ప్రకటిస్తూ విద్యార్థి సంఘం నేతలు ప్రకటన చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో జూలై 25న విద్యాసంస్థల బంద్‌కు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పిలుపునిస్తూ ప్రకటన చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఆగడాలు ఎక్కువవుతున్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలనే డిమాండ్‌తో బంద్ నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరుతున్నారు.
రాష్ట్రంలో చాలా వరకూ సంక్షేమ హాస్టల్స్ అన్ని పాతబడి పోయాయని, కొన్ని పెచ్చులు ఊడి పడుతున్నాయని, అలాంటి భవణాలను ఆదునికరించాలని, మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అమ్మఒడి పథకం కింద ప్రస్తుతం ఒక్కరికే నగదు ఇస్తున్నారని, కుటుంబంలోని అందరికీ అది వర్తింపజేయాలని, హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవడం లేదని, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ విద్యార్థుల స్కాలర్ షిప్, మెస్ ఫీజులను పెరిగిన ధరలకు అనుగుణంగా మాత్రమే పెంచాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని కోరారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పలు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో జూలై 25న విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.