పవన్ కళ్యాణ్ డేటా చోరీ ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని (Perninani) స్పందించారు. ‘ హోం మంత్రి అమితా షా, ప్రధాని మోదీతో నీకు నిజంగా బంధం ఉంటే డేటా చోరీని నిరూపించు? పవన్ సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ప్రజాసాధికారిక సర్వే పేరుతో చంద్రబాబు డేటా చోరీ చేస్తే నువ్వు ఏం చేశావ్? ఇవాళ రంకెలేస్తున్న పవన్.. ఆనాడు నోరు ఎందుకు మెదపలేదు? జనసేన పార్టీ సభ్యత్వం పేరుతో నువ్వు సేకరిస్తున్న డేటా ఎవరికి ఇస్తున్నావ్?’ అని నాని ప్రశ్నించారు.
సీఎం జగన్ ను జైలుకు పంపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సొల్లు కబుర్లు చెబుతున్నారని, తాను జనసేనానికి సవాల్ విసురుతున్నానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.పవన్ కు దమ్ముంటే, చేతనైతే నీకు ఇష్టం వచ్చిన సంస్థతో లేదా కేంద్ర సంస్థతో విచారణ చేయించుకోవచ్చునన్నారు. మోదీ (PM Modi) తన చేతిలో ఉన్నారని, అమిత్ షా తన చేతిలో ఉన్నారని చెబుతున్నారని, నీకు బీజేపీ (BJP)తో బంధం ఉంది కదా.. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.