గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా.. పీకల్లోతు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫైనల్‌గా ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాంతో పెళ్లికి ముందే కాఫీ డేట్ అంటూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఫస్ట్ టైం ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో మరోసారి కలిసి నటించారు. అయినా కూడా ఎప్పటికప్పుడు ప్రేమ వార్తలను పుకార్లు అంటూ కొట్టిపారేశారు. అయితే ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. వరుణ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న నాగబాబు ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సమయం దొరికినప్పుడల్లా.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చిన వరుణ్, లావణ్య.. తాజాగా కాఫీ డేట్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ జంట. లావణ్య త్రిపాఠి ఫోటోను వరుణ్ తన స్టోరీలో పెట్టగా.. వరుణ్ ఫోటోను లావణ్య తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
దీంతో పెళ్లికి ముందే.. డేట్స్ అంటూ షికార్లు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే.. ప్రస్తుతం వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 25న ఈ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు ఏయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి చేతిలోను కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పలు వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది.