BRO Movie: 10 నిమిషాల్లో 2 వేల టిక్కెట్లు ఏంది ‘బ్రో’?
మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు.. ఆ రోజుని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. కానీ ఈసారి బ్రో మేకర్స్ మాత్రం అలా చేయడం లేదు. అయినా బ్రో క్రేజ్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దుమ్ములేపుతోంది బ్రో.
పవన్ ఎవరితో సినిమా చేస్తున్నాడు? ఎలాంటి సినిమా చేస్తున్నాడు? అనే విషయాలతో సంబంధం లేకుండా.. పవన్ నుంచి సినిమా వస్తే చాలు అన్నట్టుగా రిలీజ్ రోజు థియేటర్స్ టాపులు లేచిపోయేలా హంగామా చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. ఓపెనింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ కలెక్షన్స్‌కి ఇంకాస్త పెంచుకోవడానికి ప్రొడ్యూసర్స్ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్‌లో చేస్తారు. దాంతో అప్పటివరకూ ఉన్న ప్రతి పాత రికార్డ్ చెల్లాచెదురు అవుతుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్న ప్రతి ప్రొడ్యూసర్‌కి తెలుసు. అందుకే ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్ చేస్తారు. కానీ పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’ విషయంలో మాత్రం అలా జరగట్లేదు.
సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. కానీ ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయడం లేదు మేకర్స్. అయినా కూడా బ్రో క్రేజ్ చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఓవర్సీస్ లో ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వడమే ఆలస్యమన్నట్టు నిమిషాల వ్యవధిలోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లండన్‌లో బుకింగ్స్ ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట.
ఇక అమెరికా లో కూడా గంటకి 5 వేల డాలర్స్ లెక్కన టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయట. ఈ లెక్కన పవర్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం ట్రైలర్ కూడా రాకుండానే.. బ్రో అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతుందని చెప్పొచ్చు. ఇక ఈ నెల 21న బ్రో ట్రైలర్ రిలీజ్ చేస్తుండగా.. 25న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. మరి బ్రో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.