కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు (VH Hanumantha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవ్వడం ఖాయం లేకుంటే తనపేరు హనుమంతరావు కాదని వీహెచ్ అన్నారు.పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ(Congress party), మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గరిబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలకు సేవ చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలో బీసీల భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.జనాభా ప్రతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.
దీంతో బీజేపీ (BJP) వెన్నులో వణుకు పుట్టిందని వీహెచ్ తెలిపారు. కులాల పేరుతో మనం కొట్టుకోకుండా ఐక్యంగా ఉండాలని, మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబమన్నారు.కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పార్టీలో బలోపేతానికి గట్టిగా కష్టపడితే అధికారం మనదేనని వీహెచ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారని, ఎప్పుడు సభ ఉంటుంది అనేది మళ్ళీ వచ్చి చెప్తానని తెలిపారు. ఈ సభను అందరు సక్సెస్ చేయాలన్నారు. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామని, సీఎం కేసీఆర్ (CMKCR) మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారని, నువ్వెందుకు వేస్తావు.. జనమే నిన్ను వేస్తారు బంగళాఖాతంలో అని వీహెచ్ ఎద్దేవా చేశారు.