»Breaking Padmavati Express Derailed Many Trains Stopped Everywhere
Breaking: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్..ఎక్కడికక్కడ ఆగిపోయిన పలు రైళ్లు!
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రైలు ప్రమాద ఘటనలు(Train Accidents) చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటన తర్వాత చాలా ప్రాంతాల్లో రైళ్లు పట్టాలు తప్పుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్(Padmavathi Express) పట్టాలు తప్పింది. బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్(Tirupathi Railway station)లో 6వ ప్లాట్ఫారం వద్ద ఎక్స్‌ప్రెస్‌లోని ఓ భోగి పట్టాలు తప్పింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తమై సత్వర చర్యలు చేపట్టారు. సమస్యను త్వరగా పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా భోగీలు పట్టాలు తప్పినట్లుగా అధికారులు వెల్లడించారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్(Padmavathi Express) పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయల్దేరాల్సిన 12763 నంబర్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ 19.45 నిమిషాలకు బయల్దేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
12793 నెంబర్ తిరుపతి – నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్(Rayalaseema Express) బయలుదేరే సమయం కూడా అధికారులు మార్పు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి(Tirupathi) నుంచి బయల్దేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 గంటలకు బయల్దేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.