SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి 5 హుండీలను సికింద్రాబాద్ సీతాఫల్ మండికి చెందిన వాసగోని మహేష్ గౌడ్ – సంధ్యారాణి దంపతులు విరాళంగా ఇచ్చారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఛైర్మన్ గంగం నరసింహారెడ్డి సమక్షంలో వీటిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.