BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, వ్రతమండపం భక్తులతో నిండిపోయింది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, వీవీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది.
Tags :