మరో పది రోజుల్లో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోంది. మెగా మల్టీ స్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి బ్రో సినిమా చేశారు పవన్. హీరోయిన్లుగా యంగ్ బ్యూటీస్ కేతికా శర్మ(Ketika sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. ఈ సందర్బంగా కేతికా శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జూలై 28న ‘బ్రో’ మూవీ(BRO Movie) థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అదిరిపోయాయి. ఇక థమన్ అందించిన రెండు సాంగ్స్ మై డియర్ మార్కండేయ, జాణవులే పాటలకు రెస్పాన్స్ బాగానే ఉంది. జూలై 21న అంటే బ్రో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూలై 25న హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కేతికా శర్మ(Ketika sharma) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రో సినిమా(BRO Movie) ఒప్పుకోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. పవన్ కాంబినేషన్లో నాకు సీన్స్ లేవు. కానీ ఆయనతో కలిసి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అంతకముందు ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించిందని చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే కాస్త భయమేసింది.
సాయి ధరమ్ తేజ్ చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు అని అన్నారు. ఇక జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడాలి. ఫలితం గురించి ఆలోచించొద్దు..అని చెప్పింది కేతికా శర్మ(Ketika sharma). రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆతర్వాత ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేసింది. కానీ ఈ సినిమాలు అమ్మడికి పెద్దగా అవకాశాలు తెచ్చి పెట్టలేదు. కానీ ‘బ్రో’ సినిమా(BRO Movie) తో బంపర్ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం కేతికా ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి.