ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం రాత్రి అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి పనులు, పాలలో ప్రధాన సమస్యలపై చర్చించారు. ఒంగోలు నగర అభివృద్ధి పనులకు త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.