VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్గా ఎస్. జనార్ధన రావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం నగర పాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇక్కడకు ప్రమోషన్ పై కమిషనర్గా వచ్చారు. ఈసందర్బంగా ఛైర్పర్సన్ బంగారు సరోజిని, వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు.