AP: మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి ధర్మాన మండిపడ్డారు. ‘పంటకు యూరియా అందించడం కూటమి ప్రభుత్వం విఫలమైంది. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోండి. కనీస మద్దతు ధర చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టండి. కష్టకాలంలో రైతులకు అపన్నహస్తం అందించి మానవతను చాటుకోవాలి’ అని ప్రభుత్వానికి సూచించారు.