»Thalapathy Vijay Made Another Plan Before Political Entry
Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీ కి ముందు మరో ప్లాన్ వేసిన విజయ్!
గత కొన్ని రోజులుగా తలపతి విజయ్(thalapathy Vijay) రాజకీయ ప్రవేశం చర్చనీయాంశమైంది. అతను రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన కబుర్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు దీని గురించి మరోవార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ తలపతి విజయ్(thalapathy Vijay) పొలిటికల్ ఎంట్రీ. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పాగానే అందరూ షాకయ్యారు. గత రెండు నెలలుగా ఆయన చేసిన ఎత్తుగడలు, సమావేశాలు ఆయన రాజకీయ ప్రవేశాన్ని అతి త్వరలో ధృవీకరించాయి. కాగా ఈ పొలిటికల్ ఎంట్రీకి ముందు ఆయన మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ ఎంట్రీకి ముందు డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా తీయాలని ఆయన అనుకుంటున్నారట.
అది కూడా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మీద ఈ మూవీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే విజయ్ కి శంకర్(shankar) కథ చెప్పాడని, అది విజయ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. స్క్రిప్ట్‌ను డెవలప్ చేయమని శంకర్‌ని అభ్యర్థించాడు. అన్నీ కుదిరితే, ఇద్దరు తారల ప్రస్తుత కమిట్మెంట్ల తర్వాత ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుంది. విజయ్ లోకేష్ కంగరాజ్తో LEO పూర్తి చేసాడు. వెంకట్ ప్రభుతో తలపతి 68ని ప్రకటించాడు. ఈ సినిమాలో రాజకీయ కోణం కూడా ఉంటుంది.
శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ఉలగనాయగన్ కమల్ హాసన్ భారతీయుడు 2తో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత, శంకర్ విజయ్ పొలిటికల్ థ్రిల్లర్‌పై దృష్టి పెట్టాడు. సామాజిక సందేశాలను సమర్థవంతంగా అందించడంలో శంకర్ నిపుణుడు. విజయ్(Vijay)తో ఆయన సినిమా తప్పకుండా సంచలనం సృష్టిస్తుంది. అతని రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్‌కి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సమాచారం.