»Remember This Child Artist Pranavi Manukonda Now The Heroine
Pranavi manukonda: ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? ఇప్పుడు హీరోయిన్
యంగ్ హీరోయిన్ ప్రణవి మానుకొండ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పోస్ట్ చేసిన ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
నటి ప్రణవి మానుకొండను గుర్తుపట్టారా? లేదా అయితే ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాల జంపాలా చిత్రాలు చూస్తే ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం చూడవచ్చు.
ఆ తర్వాత ప్రణవి తన డబ్స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ తర్వాత తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఎవరే నువ్వు మోహిని, సూర్యవంశం, గంగ మంగ, పసుపు కుంకుమ మొదలైన కొన్ని సీరియల్స్‌లో నటించింది.
ప్రస్తుతం 2023లో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ చిత్రంతో ప్రణవి కథానాయికగా అరంగేట్రం చేస్తుంది.
అన్నట్లు ఈ నటి తెలంగాణలోని హైదరాబాద్‌లో మే 19, 2004న జన్మించింది.
ఇంకా పాతికేళ్లు నిండకుండానే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది