ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన దర్శకుడు కొరటాల శివ.. ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకే కొరటాల ఈ సినిమా కోసం ఇంత సమయం తీసుకుంటున్నాడని అంటున్నారు. ముందు నుంచి ఈ సినిమా కథ మారిందని.. కొరటాల మరో కొత్త కథను రాస్తున్నాడని.. అందుకే లేట్ అవుతోందని వినిపించింది. ఆచార్య దెబ్బకు కొరటాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.. కాబట్టి ఈసారి గట్టిగానే కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. ముందుగా ఒక పార్ట్ తీయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు రెండు భాగాలుగా ఫిక్స్ అయిపోయారట. ఎలాగైనా సరే.. కొరటాల ఈ సినిమాతో సాలిడ్ కమ్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ నిజమైతే మాత్రం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. ఇకపోతే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను.. ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నారు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్‌గానే ప్రకటించింది చిత్ర యూనిట్. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ కలిసి.. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్-కొరటాల కాంబో.. ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.