కర్నూలు: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశం పై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.