MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ మమత శ్రీనివాస్ పట్టణంలోని పలు డివిజన్లలో అధికారుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను ఆమె స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.