JN: కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంటలకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందేలా చూడాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏవో అంబికా సోనీ, ఎస్ఈలు సీతారాం, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.